: టి20 క్రికెట్లో మన ర్యాంకు పదిలం
గత కొంత కాలంగా టి20 మ్యాచ్ లాడని టీమిండియా ఆ ఫార్మాట్లో మాత్రం తన ర్యాంకును పదిలపరుచుకుంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన మినీ ఫార్మాట్ ర్యాంకుల జాబితాలో భారత్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో విజయాలతో ఊపుమీదున్న శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండింటికి 123 పాయింట్లు ఖాతాలో ఉన్నా... దశాంశాల తేడాతో సఫారీలు మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.