: ఓటరు నమోదుకు ఆదివారం వరకు అవకాశం
వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. ఓటరు నమోదు కోసం ఈ నెల 9వ తేదీ, ఆదివారం నాడు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. కొత్త ఓటర్లు, ఓటరు కార్డు పోయిన వారు ఎవరైనా సరే ఆదివారం నాడు పోలింగ్ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవచ్చు.