: తెలంగాణలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడుతామని కేసీఆర్ చెప్పారు.