: మేనకోడలిపై అత్యాచారం కేసులో యువకుడికి జీవిత ఖైదు


మేనకోడలిపై మూడేళ్లుగా పదే పదే అత్యాచారం చేయడంతో పాటు, ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించినందుకు ఓ యువకుడికి ఢిల్లీ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అతడు చేసిన పనికి క్షమించి వదిలేసే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని బేగంపూర్ పీఎస్ లో గతేడాది జూలైలో ఫిర్యాదు నమోదైంది. మేనమామ అయి ఉండి మేనకోడలి శీలాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సింది పోయి, అతడే అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని జడ్జి వ్యాఖ్యానించారు.

బాధితురాలు అతడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని, విషయం వెలుగులోకి రావడానికి ముందు మూడేళ్ల నుంచి ఈ ఘోరానికి పాల్పడుతున్నాడని ఆయన చెప్పారు. కేసు విచారించిన న్యాయమూర్తి నేరస్తుడికి జీవిత ఖైదుతో పాటు 11 వేల రూపాయల జరిమానా విధించారు. ఢిల్లీ ప్రభుత్వం బాలిక సంక్షేమం, పునరావాసానికి నష్టపరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి అరుణ్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News