: మమతకు జయలలిత ఫోన్
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వివిధ పార్టీల మధ్య కొత్త బంధాలు, బంధుత్వాలు మొలకెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మమత ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని జయ గుడ్ లక్ చెప్పారని... తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల అనంతరం జయ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలసి పనిచేయడానికి తాను సిద్ధమని మమత చెప్పిన మరుసటి రోజే ఇద్దరి మధ్య సంభాషణ జరగడం విశేషం.