: 'స్వలింగ' వివాహాలకు ఓకే చెబుతున్న దలైలామా


టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటే తప్పేమీ కాదంటున్నారు. ఇటీవలే అమెరికా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన దలైలామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చిన మార్గంలో, తమకు సంతృప్తి అనుకున్న మార్గంలో నడిస్తే అభ్యంతరమేముంటుందని పేర్కొన్నారు. ఆ సంబంధం వాళ్ళిద్దరికీ ఆమోదయోగ్యమైతే అందరకీ సమ్మతమేనని వ్యాఖ్యానించారు. అయితే, ఈ స్వలింగ వివాహాలు ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని, ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డారు. వారిపై ఆంక్షలు విధించడం, దూషించడం సరికాదని, అది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News