: బీజేపీలో చేరిన పురంధేశ్వరి


కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బీజేపీలో చేరారు. కాసేపటి క్రితం బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసంలో సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులవైపు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. సాయంత్రం 7 గంటలకు ఆమె మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంలో ఆమె బీజేపీలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News