: అభివృద్ధి రాజకీయాలే దేశానికి కావాలి: నరేంద్రమోడీ
ఇన్నాళ్ళూ దేశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు నాశనం చేశాయనీ, ప్రస్తుత పరిస్థితులలో అభివృద్ధి రాజకీయాలే జాతికి అవసరమనీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని శ్రీరాం కామర్స్ కళాశాల విద్యార్ధులతో సమావేశమైన మోడీ తన ఉపన్యాసంతో ఆకట్టుకున్నారు.
ఇండియాను ప్రపంచ బ్రాండ్ గా మార్చే శక్తి యువతకే వుందని మోడీ అన్నారు. ప్రజలు మెచ్చుకునే విధంగా గుజరాత్ పరిపాలన ఉంటుందని, ఎన్ని సమస్యలున్నా ఆశావాద దృక్పథంతో ముందుకు పోవాలని మోడీ సూచించారు. కాగా, ఆయనను అడ్డుకునేందుకు కళాశాల బయట ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు యత్నించారు.