: కేసీఆర్ ప్రయత్నమంతా దొరలరాజ్యం కోసమే: దానం
తెలంగాణలో దొరలరాజ్యం తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మాజీ రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అయి, కుమారుడు కేటీఆర్ ను హోంమంత్రిగా, కూతురు కవితను మంత్రిగా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సామాజిక తెలంగాణ కావాలి కాని, దొరల తెలంగాణ కాదని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలకే సీఎం పదవి ఇవ్వాలని తమ అధినేత్రి సోనియా చెప్పారని తెలిపారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా లేకున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.