: ఎంపీ వద్దు... ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా: కిషన్ రెడ్డి


తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశించినా తాను ఎంపీగా పోటీ చేయనని చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన అంబర్ పేట నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇరు ప్రాంతాల్లోను బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News