: రష్యా... ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది: ఒబామా
రష్యా తన చర్యల ద్వారా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్టయిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇరు దేశాలు తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు దౌత్యపరమైన పరిష్కారం దిశగా సాగాలని సూచించారు. ఈ ఉదయం ఒబామా... పుతిన్ తో గంటకు పైగా మాట్లాడారు. ప్రపంచ శాంతి దృష్ట్యా రష్యా సంయమనం పాటించాలని హితవు పలికారు. రెండు దేశాలు నేరుగా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.