: త్వరలోనే కొత్త బ్యాంకులకు లైసెన్స్ లు: రాజన్
వచ్చే కొన్ని వారాల వ్యవధిలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు లైసెన్స్ లు జారీ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి కోరతామని చెప్పారు. కొత్త బ్యాంకు లైసెన్స్ లపై జలాన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు కమిటీ పరిశీలిస్తోంది.