: లక్ష్మీమీనన్ స్టడీస్ లో వీక్ అంటున్న సిద్దార్థ్
హీరో సిద్దార్థ్ సహ నటులను ఆటపట్టించడంలో ముందుంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో జిగర్ తాండ అనే తమిళ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ నుంచి కథానాయిక లక్ష్మీమీనన్ అర్ధాంతరంగా బయల్దేరి కేరళ వెళ్లిపోయింది. మర్నాడు ఆమె ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయాల్సి ఉండడంతో వెళ్లింది. దీంతో సిద్దార్థ్ మాట్లాడుతూ.. లక్ష్మిని స్కూల్ స్టూడెంట్ అంటూ తాము ఆట పట్టిస్తుంటామన్నారు. 'పదకొండో తరగతిలో ఉన్నానంటూ ఏడాదిన్నరగా లక్ష్మి చెబుతూనే ఉంది. చదువుల్లో కాస్త వీక్. ఆమెకు ట్యూషన్లు పెట్టించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది' అని సిద్దార్థ్ చెప్పాడు.