: కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది: రఘువీరారెడ్డి


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా పిరికిపందలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజు (శుక్రవారం) ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఆ పార్టీ సాకారం చేసిందని ఆయన చెప్పారు. సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలతో చర్చించిన తర్వాతే కేంద్రం రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News