: మీరట్ వర్శిటీ సస్పెండ్ చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తా: హఫీజ్


ఇటీవల దాయాదుల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు జై కొట్టి సస్పెండయిన మీరట్ వర్శిటీ విద్యార్థులకు తాను బాసటగా నిలుస్తానంటున్నాడు ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్. వారికి స్కాలర్ షిప్ ఇస్తానని చెబుతున్నాడు. ప్రపంచంలో వారు ఎక్కడ చదువుకోవాలన్నా తాము ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చాడీ చీఫ్. పాకిస్తాన్ వారిని చూసి గర్విస్తోందని పేర్కొన్నాడు. విద్యార్థులను వెళ్ళగొట్టడం ద్వారా కాశ్మీర్ పై భారత వైఖరి మరోసారి వెల్లడైందని హఫీజ్ ఆరోపించాడు. గత ఆదివారం భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా మీరట్ లోని స్వామి వివేకానంద సుభార్తి విశ్వవిద్యాలయం విద్యార్థులు కొందరు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన వర్శిటీ పాలకవర్గం 67 మందిని సస్పెండ్ చేసింది. వీరందరూ జమ్మూకాశ్మీర్ కు చెందినవారు.

  • Loading...

More Telugu News