: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: దగ్గుబాటి
ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త అన్న సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు దగ్గుబాటి ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రకాశం జిల్లా కారంచేడులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు దగ్గుబాటి ప్రకటించారు. మరో వైపు ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో ‘కమల తీర్థం’ తీసుకొంటున్న విషయం విదితమే.