: ట్విట్టర్ల మనసు గెలుచుకుంటున్న పోప్!
క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ట్విట్టర్లో ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఎక్కువ మంది యూజర్లు పోప్ ఫ్రాన్సిస్ పై సానుకూల ట్వీట్స్ చేస్తున్నారని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 84 శాతం మంది సానుకూలంగా ఉంటుంటే.. 16 శాతం వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నట్లు ప్యూ సంస్థ వెల్లడించింది. 80లక్షల ట్వీట్స్ ను విశ్లేషించి ఈ వివరాలను రూపొందించింది. పోప్ బెనడిక్ట్ -16తో పోలిస్తే.. ఫ్రాన్సిస్ ట్విట్టర్ల మనసులను గెలుచుకోవడంలో ముందున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే, పోప్ బెనడిక్ట్-16 గురించి ట్విట్టర్లో 70 శాతం మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. 30 శాతం మందే సమర్థించారని ప్యూ తెలిపింది. పోప్ ఫ్రాన్సిస్ అకౌంట్ కు ట్విట్టర్లో 37.5లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.