: రాహుల్ పై పరువునష్టం దావా వేస్తామంటున్న ఆర్ఎస్ఎస్


మహాత్ముణ్ణి చంపింది ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) వాదులే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. రాహుల్ పై పరువు నష్టం దావా వేస్తామని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని తెలిపింది. నిన్న మహారాష్ట్రలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ, రాహుల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'గాంధీజీని ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు, ఇప్పుడు ఆయన గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు' అని విమర్శించారు.

దీనిపై ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రామ్ మాధవ్ స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని పేర్కొన్నారు. గాంధీ హత్యను తమకు ముడిపెట్టడం భావ్యం కాదని, ఈ విషయంపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని తెలిపారు. అంతేగాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మహాత్ముడు 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే అనే హిందుత్వవాది చేతిలో హతమయ్యాడు. అహింసా బోధనలకు వ్యతిరేకంగానే తానీ చర్యకు పాల్పడ్డట్టు అప్పట్లో గాడ్సే ప్రకటించుకున్నాడు.

  • Loading...

More Telugu News