: అతి చేసిన జడేజా.. అంపైర్ ఆగ్రహం
ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ జడేజా తీరు అంపైర్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తాను అవుట్ ఇవ్వకముందే జడేజా విపరీతమైన ఆనందంతో గెంతులేయటం అంపైర్ అలీమ్ దార్ కోపానికి కారణమైంది. ఆస్టేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటైన సందర్భంలో ఈ ఘటన జరిగింది. జడేజా తీరుపై అంపైర్ ఆగ్రహం చెందడంతో సచిన్ పిలిచి జడేజాను పద్దతి మార్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు.