: వడగండ్ల వానతో నిజామాబాద్ రైతుకు కడగండ్లు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కురిసిన వడగండ్ల వానతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో మండలంలో తీవ్ర పంటనష్టం జరిగింది. వర్ని పరిధిలోని 10 గ్రామాల్లో పంట నేలకొరిగింది. దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెందూరులో ఈరోజు ఉదయం రైతులు రాస్తారోకో నిర్వహించారు.