: ఏం చేయగలరో అది చేసుకోండి... భయపడేది లేదు: కిరణ్


తన పాలన అంతా తెరిచిన పుస్తకమన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొన్ని విషయాలను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న చివరి రోజుల్లో అనంతపురంలో నాలెడ్జ్ పార్క్ ని క్యాన్సిల్ చేశానని అన్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా రద్దు చేశానని తెలిపారు. సోంపేటలో రైతుల భూముల్ని నాగార్జున కంపెనీకి కేటాయించడాన్నీ రద్దు చేశానని చెప్పారు.

తన రాజకీయ జీవితం మొత్తం వెతికినా తప్పులు పట్టుకోలేరని ఆయన తెలిపారు. తనకు, తన కుటుంబానికి మచ్చ తెచ్చే ఏ పనీ తాను చేయనని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పిచ్చి ఆరోపణలు మాని సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని ఆయన సవాలు విసిరారు. తెలుగు జాతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి బాధపడి, జాతి మొత్తానికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకే తానీ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

తాను పార్టీ పెట్టడం వెనుక పదవీ కాంక్ష లేదని, ప్రజల భావాల్ని ప్రతిబింబించడానికేనని ఆయన తెలిపారు. తెలుగు జాతికి నికార్సయిన పార్టీ ఒకటి ఉండాలని తాను పార్టీ పెడుతున్నానని అన్నారు. తానెప్పుడూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనలేదని, లగడపాటిని కూడా తన ప్రకటన ఉపసంహరించుకోమని కోరుతున్నామని అన్నారు. తామంతా శాయశక్తులా సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డామని, అయినప్పటికీ తమ మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేశారని ఆయన తెలిపారు. తామెప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదని, తెలుగు జాతిని ఏకం చేసేందుకే పాటుపడ్డామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News