: జట్టుకు భారం అనుకున్న రోజున తప్పుకుంటా: అఫ్రిది
విధ్వంసక ఫామ్ కనబరుస్తున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది రిటైర్మెంట్ పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. జట్టుకు భారం అనుకున్న రోజున స్వచ్ఛందంగా తప్పుకుంటానని వెల్లడించాడు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో మీడియాతో మాట్లాడుతూ, 'నా నిష్క్రమణపై మాట్లాడేందుకు మరొకరికి అవకాశమివ్వను. ఫిట్ గా ఉన్నంతకాలం క్రికెట్లో కొనసాగుతా. దేశం కోసమే నా ఆట' అని తెలిపాడు. ఆసియా కప్ లో అఫ్రిది భారత్ పై 34 నాటౌట్, బంగ్లాపై 25 బంతుల్లో 59 పరుగులు చేసి ఆ మ్యాచ్ లను మలుపు తిప్పాడు.