: 'గులాబ్ గ్యాంగ్' చిత్రంపై స్టే ఎత్తివేత
మాధురీ దీక్షిత్, జూహీచావ్లా నటించిన బాలీవుడ్ చిత్రం 'గులాబ్ గ్యాంగ్' చిత్రంపై ఢిల్లీ హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ మేరకు రేపు దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారంటూ సంపత్ పాల్ అనే ఉద్యమకారిణి నిన్న (బుధవారం) కోర్టులో పిటిషన్ వేయడంతో స్టే ఇచ్చింది. దానిపై ఈ రోజు ఆ చిత్రం నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో స్టే తొలగించింది.