: వికటించిన ఐరన్ మాత్రలు... 21 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసే మాత్రలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో రక్తహీనత లోపాన్ని సవరించేందుకు సరఫరా చేసే ఐరన్ మాత్రలు వికటిస్తున్నాయి. దీంతో వీటి తయారీ, నాణ్యత, సరఫరాపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి, 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.