: నగ్న వీడియో బయటపెడతానని బెదిరించినందుకు ప్రతిఫలం...!


ఓ మహిళ వివస్త్రగా ఉన్నప్పటి వీడియోను బహిర్గతం చేస్తానంటూ బెదిరించిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు రెండున్నర లక్షలు జరిమానా విధించింది. కిషన్ రాజ్(22) అనే ఫ్లయిట్ అటెండెంట్ కు ఓ 21 ఏళ్ల మహిళ ఓ వెబ్ సైట్ ద్వారా సింగపూర్ లో పరిచయమైంది. అప్పట్నుంచి రోజు మోబైల్ ద్వారా వీడియో ఛాటింగ్ చేసుకునే వారు. కొన్ని రోజులకు ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు.

కిషన్ రాజ్ ఆమెను వ్యక్తిగతంగా కలవాలని కోరాడు. దానికి ఆమె 15 వేల రూపాయలు ఇస్తే కలుస్తానని చెప్పింది. దానికి ఓకే చెప్పిన కిషన్ రాజ్, దానిని వీడియో తీసుకోవడానికి అనుమతిస్తే మరో 10 వేల రూపాయలు ఇస్తానని బేరమాడాడు. దానికి ఆమె ఒప్పుకుంది. తరువాత డబ్బులు అడగగా, తాను తీసిన వీడియో బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె అక్కడి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అక్కడి కోర్టు విచారణలో అతను నేరాన్ని అంగీకరించడంతో... 2.5 లక్షల రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News