: పశ్చిమగోదావరిలో ఎన్నికల ఖర్చు అధికం


రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అత్యధికంగా ఖర్చు చేసే జిల్లాల్లో పశ్చిమగోదావరి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ పెట్టే ఖర్చు ఒక ఎత్తైతే, ఎన్నికల్లో గెలుపోటములపై బెట్టింగులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దీంతో రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు పెట్టే జిల్లాల జాబితాలో పశ్చిమగోదావరిదే అగ్రస్థానం అని విశ్లేషకులు చెబుతుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్ కు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇక్కడ అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది. గెలుపు గుర్రాల ఎంపిక, ఎన్నికల ఖర్చు వంటి వాటిపై ఊహలు ఊపందుకున్నాయి.

  • Loading...

More Telugu News