: నాలుగో స్థానంపై మొగ్గు చూపుతున్న రహానే
టీమిండియా యువకెరటం అజింక్యా రహానే నాలుగో స్థానంలో బరిలో దిగడాన్ని సవాలుగా స్వీకరిస్తానని తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా రాణించిన ఈ ముంబై బ్యాట్స్ మన్ టి20 వరల్డ్ కప్ దృష్ట్యా నాలుగో డౌన్ లో రావడాన్నే ఇష్టపడతానని చెప్పాడు. 'ఓపెనర్ గా వస్తే తొలి పది ఓవర్లు కొత్త బంతిపై విరుచుకుపడే అవకాశముంటుంది. అదే నాలుగో స్థానం అయితే, ఒక్కోసారి మనం క్రీజులోకి వచ్చే సమయానికి స్కోరు 30/2 గానీ 40/2 గానీ ఉండొచ్చు. మరికొన్ని సార్లు 120/2 గానీ, 150/2 గానీ ఉండొచ్చు. అలాంటప్పుడు విభిన్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. నాలుగో స్థానం నిజంగా సవాల్ తో కూడుకున్నది' అని తెలిపాడు.