: భారత్ ను భయపెట్టే స్థాయిలో చైనా రక్షణ బడ్జెట్


దేశ రక్షణ విషయంలో చైనా తన దూకుడును ప్రదర్శిస్తోంది. తన వార్షిక రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచింది. 13,200 డాలర్ల (రూ.8,18,400 కోట్ల రూపాయలు) నిధులను రక్షణ అవసరాల కోసం కేటాయించింది. తాజాగా పార్లమెంటు (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్) కు ఈ మేరకు ప్రభుత్వం రక్షణ బడ్జెట్ ను సమర్పించింది. భారత రక్షణ బడ్జెట్ కంటే.. చైనా తాజా కేటాయింపులు నాలుగు రెట్లు అధికం. డ్రాగన్ (చైనా) తన బలాన్ని పెంచుకుంటూ పోతుండడం భారత్ కు ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ రక్షణ బడ్జెట్ 2.03 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.

  • Loading...

More Telugu News