: చెత్త లారీ కొని చిక్కులు తెచ్చిన బుడతడు


చిన్నారుల తుంటరి చేష్టలకు అడ్డుకట్ట వేయడం ఎవరి తరమూ కాదు. చిన్నారుల ఇష్టాయిష్టాలకు కూడా కారణాలు ఉండవు. లండన్ లో ఓ బుడతడు తన తల్లి క్రెడిట్ కార్డుతో ఏకంగా చెత్త లారీని కొనేసి చిక్కులు తెచ్చాడు. చెత్త బుట్టలు, చెత్త వస్తువులను అమితంగా ఇష్టపడే విలియం బేట్ మాన్ అనే గడుగ్గాయి, ఇంట్లోని తల్లి కంప్యూటర్ నుంచి 'ఈబే' ఖాతా తెరిచి ఆన్ లైన్ షాపింగ్ లో 3,500 పౌండ్లు (3.6 లక్షలు) ఖర్చు చేసి చెత్త లారీని కొనేశాడు. తరువాత తన అకౌంట్ వివరాలు చూసుకుని ఆమె అవాక్కైంది. దీంతో జరిగిన పొరపాటును ఈబే నిర్వాహకులకు తెలిపి, బాలుడి చర్యను మన్నించి, ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరింది. అందుకు వారు కూడా అంగీకరించారు. దీంతో ఆ తల్లి 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంది.

  • Loading...

More Telugu News