: జగన్ ఫ్లెక్సీలు తొలగించిన నరసరావుపేట ఈవీఎం కళాశాల యాజమాన్యం.. ఉద్రిక్తత
గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ముందుగానే ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లాలోని నరసరావుపేట ఈవీఎం కళాశాల గేటుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీలు కట్టగా వాటిని కళాశాల యాజమాన్యం తొలగించింది. ఆగ్రహించిన కార్యకర్తలు కళాశాల బస్సును ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.