: ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేస్తా: రేణుకా చౌదరి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. టీఆర్ఎస్ తో పొత్తు, విలీనం ఉండవని తేలిపోయిందని, ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతా తమ మంచికేనని, టీఆర్ఎస్ వాళ్లు తమతో వచ్చినా, రాకపోయినా ఇబ్బందేమీ లేదన్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని ఢిల్లీలో రేణుక అభిప్రాయపడ్డారు.