: ముస్లిమేతరులకు పెద్దపీట వేసే యోచనలో ఎంఐఎం
రానున్న ఎన్నికల తర్వాత తమ పొలిటికల్ బేస్ పెంచుకోవడానికి ఎంఐఎం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి వ్యూహరచన చేసింది. ఈ క్రమంలో మతతత్వ పార్టీ ముద్రను తొలగించుకునే పనిలో పడింది. రానున్న ఎన్నికల్లో ముస్లిమేతరులకు కూడా సీట్లు కేటాయించి... హిందువులు, క్రిస్టియన్లను ఆకట్టుకోవాలనుకుంటోంది. అంతేకాకుండా, తెలంగాణలో కీలక శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ తో పొత్తుకు సై అంటోంది. దీనికి తోడు సీమాంధ్రలో అన్ని చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది.