: ఈయన 20 ఏళ్లుగా ఎత్తు తగ్గుతున్నాడు..!
ఎవరైనా ఎత్తు పెరగడం సాధారణం. కానీ రివర్స్ లో ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎత్తు తగ్గుతున్నాడు. 20 ఏళ్లుగా అది కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్ గఢ్ లోని జాంజిగిర్-చాంపా జిల్లాలో అఫ్రీద్ గ్రామంలో ఉండే రుద్రప్రతాప్ రాథోర్ ఒకప్పుడు 5 అడుగుల ఎత్తు ఉండేవాడు. ప్రస్తుతం 2 అడుగులకు కుంగిపోయాడు. ఎంతో మంది వైద్యులను సంప్రదించాడు. దీనిని అరుదైన వైద్య పరిస్థితిగా తేల్చారు. ఎముకలు బలహీనపడి కుంగిపోతున్నాయని చెప్పారు. కానీ, ఆ సమస్యను మాత్రం నివారించలేకపోయారు. దాంతో అతడి కుంగుదలకు అడ్డుకట్ట పడలేదు. ఇతడి దేహంలోని ఎముకలు కాల్షియంను గ్రహించలేకపోవడం సమస్యకు కారణంగా భావిస్తున్నారు. కానీ, ఏదో ఒక రోజు తనను బతికించే వైద్యం అందకపోతుందా? అన్న ఆశే రుద్రప్రతాప్ ను ధైర్యంగా నిలబెడుతోంది.