: 'తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పార్టీ విజయభేరి మోగించాలి'
రాబోయే ఎన్నికల్లో టీడీపీకే ఓటేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి, ఢిల్లీలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పేందుకు సహకరించాలని కోరారు. ఓటేయాలంటున్నది తనకోసం కాదని, తెలుగు ప్రజల భవిత కోసమని బాబు స్పష్టం చేశారు. తనకు అధికార దాహం లేదని పునరుద్ఘాటించారు.