: మహిళలకు ఢిల్లీలో ఇంకా రక్షణ లేదనే అనిపిస్తోంది: షీలా దీక్షిత్


ఓపక్క అత్యాచార నిరోధాలకు కేంద్రం పదునైన చట్టాలు చేయడానికి రెడీ అవుతుంటే, మరోపక్క దేశ రాజధాని నగరంలో కీచక పర్వాలు కొనసాగుతూ, మహిళలకు రక్షణ లేదనే విషయాన్ని చాటిచెబుతూనే వున్నాయి. తాజాగా ఢిల్లీ లజపత్ నగర్లో యువతిపై జరిగిన అత్యాచారం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ఈ ఘటనలో యువతి నోటికి ఇనుపకడ్డీ దూర్చడంతో ఆమె పరిస్డితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను పరామర్శించేందుకు వచ్చిన ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, ఆ యువతిని చూసి, షాక్ కు గురయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన షీలా, ఈ తాజా సంఘటనను బట్టి ఢిల్లీ మహిళ ఇంకా అభ్రదతలోనే వుందని తెలుస్తోందన్నారు. 

  • Loading...

More Telugu News