: కాంగ్రెస్ 'సహకార' తీరుపై టీడీపీ విమర్శ


సహకార సంఘాల ఎన్నికల్లో బయటపడుతున్న అవకతవకలపై, గురువారం జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార ఎన్నికల్లో వేలం పాటలు ఆపాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల్లో అధికారాన్ని అడ్డంపెట్టుకొని అన్ని నిబంధనలనూ అతిక్రమించినా సరైన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయన విమర్శంచారు. ఓటమి భయంతోనే తమ పార్టీకి పట్టున్నవందకు పైగా సొసైటీల్లో స్టే విధించారని 
పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో నూరుశాతం ఫలితాల ద్వారా అధిష్టానం మెప్పు పొందాలని ఆశించిన సీఎం ప్రయత్నాలు విపలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. రెండోదశ ఎన్నికల్లోనూ మరోసారి అన్ని విధాల నిబంధనలను అతిక్రమించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News