: 161 ఏళ్ళ తర్వాత అక్షరదోషాన్ని సవరించిన న్యూయార్క్ టైమ్స్
అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక న్యూయార్క్ టైమ్స్ 161 ఏళ్ళ తర్వాత ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ను సవరించుకుంది. ఎన్నో ఏళ్ళ క్రితం భూస్వామ్య వర్గాలకు అమ్ముడుబోయిన ఓ బానిస పేరును తప్పుగా ప్రచురించిన ఈ పత్రిక తాజాగా తన తప్పిదాన్ని సరిదిద్దుకుంది. ఈ బానిస కథతోనే ఆస్కార్ విన్నర్ మూవీ '12 ఇయర్స్ ఏ స్లేవ్' రూపొందింది. అప్పట్లో, అంటే, 1853 జనవరి 20న న్యూయార్క్ టైమ్స్ ఈ బానిసపై ఓ వ్యాసం ప్రచురించింది. దాంట్లో అతని పేరును సాల్మన్ నార్త్రోప్ అని ముద్రించింది. అయితే, అది నార్తప్ అని ముద్రితమవ్వాలి. ఇటీవల ఎవరో ఆర్కైవ్స్ నుంచి ఈ వ్యాసం చదువుతుండగా, అచ్చు తప్పు వెలుగు చూసింది. దీనిపై చర్చించిన న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం నిన్న తన తప్పును దిద్దుకుంది.