: తెగించి పాకిస్తాన్ వచ్చిన ముషారఫ్


పాకిస్తాన్లో అడుగిడితే చంపేస్తామంటూ తాలిబన్లు హెచ్చరించినా పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చలించలేదు. కొంచెం సేపటిక్రితం ఆయన కరాచీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నాలుగేళ్ల అనంతరం ఆయన పాకిస్తాన్ గడ్డమీద అడుగుపెట్టారు. దుబాయ్ నుంచి ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చార్టర్ ఫ్లైట్ లో కరాచి వచ్చారు. విమానంలో కూర్చున్న ఫొటోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాను సాయంత్రం ఐదుగంటలకు విమానాశ్రయం వద్దే బహిరంగ సభలో ప్రసంగిస్తానని కూడా ముషారఫ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News