: మోడీ 'అభివృద్ధి' పరిశీలించడానికే వచ్చా: కేజ్రీవాల్
గుజరాత్ ప్రభుత్వంతో పాటు మీడియా కూడా అభివృద్ధి జరిగిందని చెబుతోందని, అందుకే తాను గుజరాత్ లో జరిగిన అభివృద్ధిని చూసేందుకు వచ్చానని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. నాలుగు రోజుల గుజరాత్ పర్యటనకోసం అహ్మదాబాద్ చేరుకున్న ఆయన మాట్లాడుతూ, గుజరాత్ లో రామరాజ్యం ఉందని, విద్య, ఆరోగ్యం బాగా వృద్ధి చెందాయని, అవినీతి అంతమైపోయిందని అంటున్నారని, వాటిని చూసేందుకు వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆప్ మద్దతుదారులు 'షీలా ఓడింది... మోడీకి ముందుంది' అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంతెంత ఖర్చు పెడుతుందని, ఆ పార్టీకి నిధులు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.