: తెలంగాణ శ్రమ సోనియాకే తెలుసు: డీఎస్
తెలంగాణ ఇచ్చేందుకు ఎంత శ్రమించాల్సి వచ్చిందో తమ అధినేత్రి సోనియాగాంధీకే తెలుసునని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్లను ప్రజలు గౌరవిస్తారన్నారు. ఈ మేరకు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీఎస్, ప్రజల్లో పరపతి ఉన్న, గెలవగలిగే అభ్యర్థులే తమకు కావాలని, తెలంగాణ జేఎసీ నేతలు కూడా అర్హులైతే పోటీ చేయవచ్చునని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ కోసం పోరాడిన వారిని పార్టీ తప్పకుండా ఆదుకుంటుందన్నారు.