: అనూహ్య హత్య కేసును ఛేదించింది పోలీసులు కాదా... రైల్వే కూలీయా?


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్తేర్ అనూహ్య హత్యకేసును ఛేదించింది తామేనని పోలీసులు ఘనంగా ప్రకటించుకున్నారు. నిందితుడు దొరికాడు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అతడ్ని ఎలా పట్టుకోగలిగారు? అతడ్ని ఎవరు గుర్తించారు? ఇవన్నీ ఆసక్తికర అంశాలే.. అంతకంటే ఆసక్తికరం ఏంటంటే గతంలో కృష్ణవంశీ తీసిన 'సముద్రం' సినిమా చూశారా..! అందులో శ్రీహరి చనిపోతే సొంత ఆసక్తి కొద్దీ ప్రకాశ్ రాజ్ దర్యాప్తు చేస్తాడు. కేసును కొలిక్కి తెస్తాడు.

అలాగే ఎస్తేర్ అనూహ్య హత్య కేసును కూడా ఓ రైల్వే కూలీ శోధించి సాధించాడు. నిందితుడ్ని పోలీసులు పట్టుకునేలా సహాయపడ్డాడు. అనూహ్య దారుణ హత్యకు గురికావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆ రాత్రి లోకమాన్యతిలక్ టెర్మినస్ లో ఉన్న అందర్నీ ప్రశ్నించారు. సీసీటీవీ పుటేజి చూపించి గుర్తుపట్టమని కోరారు. ఈ క్రమంలో నిందితుడు చంద్రభాన్ ను గుర్తుపట్టిన వ్యక్తి పేరు ప్రమోద్ తోమ్రే అలియాస్ పమ్యా. అతడు అక్కడితో ఆగకుండా చంద్రభాన్ ఎక్కడున్నాడని పరిశోధించాడు.

సీసీటీవీ పుటేజ్ లో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిన పమ్యా, అతను తనతోపాటు రైల్వే కూలీగా పని చేసిన చంద్రభాన్ సానప్ అలియాస్ చౌక్యా అని గుర్తించాడు. అతను కుంజు మార్గ్ లో నివసించేవాడని తెలిపాడు. దీంతో, కుంజుమార్గ్ వెళ్లి ఆరా తీశారు. దీంతో, మళ్లీ పోలీసులు పమ్యాను ఆశ్రయించారు. 2007, 08 మధ్య చంద్రభాన్ రైల్వే కూలీగా పనిచేశాడని, తరువాత అతడి లైసెన్సు నాలుగు లక్షల రూపాయలకు అమ్మేసి కారు కొనుక్కున్నాడని, ఆ తరువాత కూడా తనను కొన్నిసార్లు కలిశాడని తెలిపాడు.

దీంతో, పోలీసుల ప్రోత్సాహంతో అతనే రంగంలోకి దిగాడు. చంద్రభాన్ ఉన్న కుంజుమార్గ్ లో ఉండి వివరాలు సేకరించడం మొదలుపెట్టడు. అతను నాసిక్ కు ఆరుకిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నాడని కనుగొన్నాడు. అక్కడికి వెళ్లి అతడు అక్కడే ఉన్నాడని నిర్థారించుకుని, చంద్రబాన్ బుల్డానాలో దైవదర్శనానికి వెళ్లినట్టు వివరాలు సేకరించి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాదు. దీంతో చంద్రభాన్ ను పోలీసులు అరెస్టు చేసి, తాము కేసును ఛేదించామని ఘనంగా ప్రకటించుకున్నారు. ఇవన్నీ వాస్తవాలని ఈ కేసులో రివార్డు వస్తే అది పమ్యాకు మాత్రమే దక్కాలని కుర్లా సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ దుమాలే తెలిపారు.

  • Loading...

More Telugu News