: ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు: ప్రీతీ జింటా


బాలీవుడ్ నటి ప్రీతీ జింటా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కాంగ్రెస్ ఎంపీ ప్రియా దత్ పై పోటీ చేయబోతోందంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఇది వందశాతం అబద్ధమని, ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ట్విట్టర్ లో స్పష్టం చేసింది. ట్విట్టర్ లో చాటింగ్ సమయంలో మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన జింటా, ఆ వార్తను మీరెక్కడ చదివారని ప్రశ్నించింది. అప్పుడే పై విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ లోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి ప్రస్తుతం బిజీగా ఉంది.

  • Loading...

More Telugu News