: సార్వత్రిక ఎన్నికల పూర్తి సమాచారం
16వ లోక్ సభ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ ప్రకటించారు. ఈసారి దేశవ్యాప్తంగా 9 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 7న ప్రారంభం కానుండగా, ఆ రోజు ఆరు లోక్ సభ స్థానాలకు జరగనున్నాయి.
ఏప్రిల్ 9న రెండో విడత ఎన్నికలు 5 రాష్ట్రాల్లోని 7 లోక్ సభ స్థానాలకు నిర్వహిస్తారు.
మూడో విడత ఎన్నికలు ఏప్రిల్ 10న 14 రాష్ట్రాల్లోని 92 స్థానాలకు జరుగుతాయి.
ఏప్రిల్ 12న 3 రాష్ట్రాల్లోని 5 లోక్ సభ స్థానాలకు నాలుగో విడత పోలింగ్ వుంటుంది.
ఐదో విడత పోలింగ్ ఏప్రిల్ 17న 13 రాష్ట్రాల్లోని 132 లోక్ సభ స్థానాలకు జరుగుతుంది.
ఏప్రిల్ 24న ఆరో విడత పోలింగ్ 12 రాష్ట్రాల్లోని 117 లోక్ సభ స్థానాలకు నిర్వహిస్తారు.
ఏడో విడత పోలింగ్ ఏప్రిల్ 30న తెలంగాణతో పాటు 9 రాష్ట్రాల్లోని 89 లోక్ సభ స్థానాలకు జరుగుతుంది.
ఎనిమిదో విడత ఎన్నికలు మే 7న సీమాంద్రతో పాటు 7 రాష్ట్రాల్లోని 64 లోక్ సభ స్థానాలకు వుంటుంది.
మే 12న తొమ్మిదో విడత చిట్ట చివరి పోలింగ్ 3 రాష్ట్రాల్లో 41 లోక్ సభ స్థానాలకు జరుగుతుంది.
మే 16న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
బీహార్ లో 8, ఉత్తర ప్రదేశ్ లో 6 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
తమిళనాడు, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ లలో ఒకే విడత ఎన్నికలు పూర్తి చేస్తారు.
ఈసారి ఎన్నికల్లో 'నోటా' విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరూ మనకి నచ్చకపోతే 'నోటా'కు ఓటేయొచ్చు.