: బీజేపీ తరపున పోటీ చేయమని అడుగుతున్నారు: నటుడు శరత్ బాబు
వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు శరత్ బాబు కూడా కాషాయదళంలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ తరపున విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని సీనియర్ నేత వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి తనకు ఫోన్లు చేసి అడుగుతున్నారని శరత్ బాబు స్వయంగా వెల్లడించారు. అందుకే ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతూ మార్గ మధ్యంలో ఆగుతున్నట్లు పూసపాటిరేగలో చెప్పారు. అక్కడ కొద్దిసేపు ఆగి ప్రజలకు అభివాదం చేసిన ఆయన పలువురు అభిమానులతో ముచ్చటించి వెళ్లిపోయారు.