: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: డీఎస్


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ కు శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా కార్యకర్తల్లో ఉందని... అయితే, కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్న డీఎస్, విభజనకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా, సీమాంధ్ర అభివృద్ధికి కూడా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News