: కిరణ్ కొత్త పార్టీపై నేడు నిర్ణయం?
కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే దానిపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి జరుపుతున్న చర్చలు, చేస్తున్న విశ్లేషణలు ఒక కొలిక్కి వచ్చాయి. నిన్న ఉదయం నుంచి సన్నిహితులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపి, క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సర్వేల ఫలితాలు, ఇతరత్రా సమాచారాన్ని సమీక్షించుకుని జిల్లాల వారీగా పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం.