: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి


రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్దమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 371-డిని సవరించకపోవడం, ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ చేయకపోవడంపై పిటిషన్ వేశారు. నదీజలాల పంపిణీపై కిరణ్ ఈ పిటిషన్ లో అభ్యంతరం తెలిపారు. ఇటీవల విద్యార్ధి ఐకాస చర్చాగోష్టిలో మాట్లాడిన కిరణ్ కుమార్ న్యాయపోరాటం వల్ల ఫలితం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News