: ఖమ్మం జిల్లాలో ప్రేమ జంట హత్య
ప్రేమికులను నిర్ధాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. ప్రేమ జంటను క్రూరంగా హత్య చేశారు. ఖమ్మం జిల్లా గుండాల మండలం మర్కోడు సమీపంలోని మామిడి తోటల్లో ప్రేమ జంట మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని గొగ్గెల సరళ, పడిగ రాంబాబుగా గుర్తించారు. రాంబాబు చింతూరు మండలంలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.