: కస్టడీలోనే సుబ్రతోరాయ్, ఇద్దరు డైరెక్టర్లు


సహార సంస్థ అధినేత సుబ్రతోరాయ్ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఆయన, ఇద్దరు డైరెక్టర్లు ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది. తన సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి రూ.20 వేల కోట్లు చెల్లించని కేసులో సుప్రీంకోర్టు విచారణకు హాజరుకాని సుబ్రతోను... పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు పెట్టుబడి దారులకు డబ్బు చెల్లిస్తానని సుబ్రతో చేసిన ప్రతిపాదనపై తమకు నమ్మకం లేదన్న సుప్రీం, వారెలాంటి బ్యాంక్ గ్యారెంటీ, సరైన ప్రతిపాదనతో రాలేదని వ్యాఖ్యానించింది. 'చట్ట ప్రకారం మీరు (సుబ్రతో) నగదు రూపంలో చెల్లించలేరు. కాబట్టి, డీడీ లేదా చెక్ ల రూపంలో పెట్టుబడి దారులకు చెల్లించండి' అని చెప్పింది. కాగా, రేపు కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News