: నెల్లూరులో రేపు టీడీపీ ప్రజాగర్జన
నెల్లూరు జిల్లాలో రేపు తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. రేపు సాయంత్రం 4 గంటలకు మాగుంట సుబ్బరామిరెడ్డి సర్కిల్ నుంచి ప్రజాగర్జన సభ జరిగే వీఆర్ కళాశాల ప్రాంగణం వరకు చంద్రబాబు ర్యాలీగా వెళతారు. సభ అనంతరం, 7.30 గంటలకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు పాల్గొంటారు.